calender_icon.png 12 March, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌లో పరస్పర సహకారం

12-03-2025 12:00:00 AM

ఎన్‌ఎండీసీ, సింగరేణి కీలక నిర్ణయం

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి):  సింగరేణి దేశ అవసరాల దృష్ట్యా క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌లోకి అడుగుపెట్టాలన్న కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం 60ఏళ్లుగా ఖనిజాల ఉత్పత్తిలో అంతర్జాతీయ అనుభవం ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని సింగరేణి సీఎండీ బలరామ్ చెప్పారు.

సోమవారం రాత్రి  సింగరేణి డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో కలిసి ఎన్‌ఎండీసీ సీఎండీ అమితావ్ ముఖర్జీ, ఆ  సంస్థ డైరెక్టర్లతో ప్రత్యేకంగా సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా విదేశాల్లో క్రిటికల్ మినరల్స్, ఇతర ఖనిజాల మైనింగ్‌లో అపార అనుభవం ఉన్న ఎన్‌ఎండీసీ సహకారం తమకు ఎంతగానో దోహదపడుతుందని సీఎండీ అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఎన్‌ఎండీసీ డైరెక్టర్లు విశ్వనాథ సురేశ్ (కమర్షియల్) పాల్గొన్నారు.