calender_icon.png 19 January, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత విద్యాభివృద్ధిలో పరస్పర సహకారం

19-01-2025 12:35:47 AM

తెలంగాణ, ఏపీ ఉన్నత విద్యామండళ్ల చైర్మన్ల భేటీ

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): ఉన్నత విద్యారంగ అభివృద్ధికి ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. శనివారం మసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బాలకిష్టారెడ్డితో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యలో ఆవిష్కరణలు, సంస్కరణలను ప్రోత్సహించడం, పరిశోధనలతోపాటు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు లబ్ధిచేకూరే విద్యాపరమైన సమస్యలపై చర్చించినట్లు బాలకిష్టారెడ్డి తెలిపారు.