calender_icon.png 28 December, 2024 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దల పండుగకు 'గాంధీ జయంతి' అడ్డు..!

02-10-2024 12:14:27 PM

ఇటు మహాత్మాగాంధీ జయంతి

అటు మహాలయ అమావాస్య

జగిత్యాల, (విజయ క్రాంతి): ఇటు మహాత్మాగాంధీ జయంతి, అటు మహాలయ అమావాస్య పెద్దల పండుగకు 'గాంధీ జయంతి' అడ్డొచ్చిపడింది. మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా భావించి  స్వర్గస్తులైనవారికి పక్షం రోజులు పాటు తర్పణం చేయడం ద్వారా పెద్దల ఆత్మలు శాంతిస్తాయని భావిస్తారు. తెలుగు రాష్ట్రాల తోపాటు దేశవ్యాప్తంగా పిత్రు పక్షాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి పెత్తర అమామాస్య (మహాలయ అమావాస్య) అక్టోబర్‌ 2వ తేదీన రావడం, ఇదే రోజు మహత్మాగాంధీ జయంతి, పెద్దల పండుగ అంటేనే మందు, మాంసాహారం విందులు పసందుగా ఉంటాయి. స్వర్గస్తులైనవారికి ఆ రెండూ నైవేద్యంగా సమర్పిoచటం అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. ఆ తర్వాత ఇచ్చిన వారు పుచ్చుకుంటారు. అయితే ఈసారి మహాత్మా గాంధీ జయంతిన రావడంతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. గాంధీ జయంతి రోజు ప్రభుత్వం మద్యం, మాంసం దుకాణాలు తెరవడానికి అనుమతి నిరాకరించారు. స్వర్గస్తులైన పెద్దలకు మందు, మాంసం ఎలా నైవేద్యంగా సమర్పిoచేది అని ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.