calender_icon.png 16 January, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా గణపతి పండుగను జరుపుకోవాలని

11-09-2024 12:19:01 PM

ముత్తారంలో వినాయక మండపాల పరిశీలనలో ఎస్ఐ రమేష్ 

ముత్తారం (విజయక్రాంతి): మండలంలోని ప్రజలు ప్రశాంతంగా వినాయక నవరాత్రి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ముత్తారం ఎస్ఐ రమేష్ తెలిపారు. బుధవారం మండలంలోని కేశనపల్లి, ముత్తారం తదితర గ్రామాలలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను ఎస్ఐ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు భక్తిశ్రద్ధలతో  పండుగను జరుపుకోవాలని కోరారు. పర్మిషన్ లేని మండపాలను గుర్తించి ఆన్ లైన్ లో అప్లోడ్ చేశారు. ఆయన వెంట సిబ్బంది రమేష్ తదితరులు ఉన్నారు.