09-03-2025 08:19:48 PM
మంథని (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి ముత్తారం దళిత నాయకులు పాలాభిషేకం చేశారు. నియోజకవర్గంలో సిఆర్ఆర్, ఎస్సీ కమ్యూనిటీ నిధుల ద్వారా రూ. 97 లక్షల 50 వేల రూపాయలు ముత్తారం మండలంలోని వివిధ గ్రామాలకు ఎస్సీ కాలనీలో పలు అభివృద్ధి పనులకు సిసి రోడ్లు, డ్రైనేజీల కొరకు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడవెన సంపత్, దళిత నాయకులు రత్న జంపయ్య, మాట్ల రవి, ముత్తారం మండలం ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షు రత్న కొమురయ్య, గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు రత్న నాగరాజ్, రత్న శంకర్, కల్వల మొగిలి, రత్న సందీప్, రమేష్, సమ్మయ్య, స్వామి రాజయ్య, శ్రీమాన్ గ్రామ అధ్యక్షులు దాసరి చంద్రమౌళి గౌడ్, మండలం సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, సీనియర్ గ్రామ శాఖ నాయకులు కోటగిరి శ్రీనివాస్, తీగల సత్తన్న, సుదాడి సంపత్ రావు, అల్లాడి రాజు, నారాయణ మంత్రి సారయ్య నరాల మల్లయ్య రత్న స్వామి తదితరులు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.