calender_icon.png 28 April, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ముత్యాలమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు

28-04-2025 01:33:20 AM

హాజరైన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్

ముషీరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ ఆంధ్రకేఫ్ చౌరస్తా సమీపంలో గల శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయం 25 వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఆలయ కమిటీ నిర్వాహ కులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కలను తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వినయ్ కుమార్ స్వాగతిస్తూ   అర్చకులచే తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వార్షికోత్సవ వేడుక ల్లో మాల బస్తి అధ్యక్షులు   జి.ఎస్.మధుసూదన్,ఉపాధ్యక్షులు జె. మదన్మోహన్, జా యింట్ సెక్రటరీ జి. విజయ్ కుమార్, ఆర్గనైజర్ బీజేపీ నేతలు అరుణ్ కుమార్,ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.