calender_icon.png 18 April, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాని ప్రారంభించిన ముత్తిమినేని వీరయ్య

09-04-2025 08:44:14 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ‌కార్యలయం ఆవరణలో వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తిమినేని వీరయ్య ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా మహాత్మా గాంధీ శాంతి సందేశం అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం మన రాజ్యాంగంలోని విలువలను ప్రజలకు చేరవేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్యంగా భావించాలన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పాదయాత్రలు గ్రామస్థాయి బ్లాక్ స్థాయి జిల్లాస్థాయి రాష్ట్రస్థాయిలో ర్యాలీల ద్వారా కొనసాగించి ప్రజలకు అవగాహన కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొన్ని శక్తులు మన రాజ్యాంగాన్ని స్వాతంత్ర సమరయోధులను అవమానిస్తున్నాయని అలాంటి పరిస్థితుల్లో మనందరం ఐక్యంగా నిలిచి ఈ ఉద్యమంలో పాలుపంచుకొని రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం పార్టీ నాయకుల, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు‌ కొప్పుల జైపాల్ రెడ్డి, కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్, యలక నరేందర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, మాతంగి బసవయ్య, దేవినేని రవి, సాయి, ఓరుగంటి రవి, కీత రమేష్, జానకి రెడ్డి, గన్నా నర్సింహరావు, జెవిఆర్ వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు పాల్గొన్నారు.