క్షణాలలో మృతి చెందిన 16 మేకలు
మనుషుల ప్రాణాలు పోయిన ఇంతేనా అని ప్రశ్నిస్తున్న లచ్చగూడెం గ్రామస్తులు
మాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్న సింగరేణి అధికారులు
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఉపరితల గనిలో వెలువడే విషవాయువులతో బుధవారం 16 మేకలు మృతి చెందాయి. పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసి పోతాయో అర్థం కావడం లేదని లచ్చగూడెం గ్రామస్తులు బొగ్గు రవాణా ఏ రహదారిపై కేవైసీలు చనిపోయిన మేకలతో ధర్నాకు దిగారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండి పడుతున్నారు. జబ్బ వెంకటేశ్వర్లుకు చెందిన మేకలు కాపరి ముసలయ్య సుమారు 30 మేకలతో ఓసిసి పరిసర ప్రాంతంలో మేతకు తీసుకెళ్లాడు.
మధ్యాహ్న సమయంలో ఆ మేకల్లో 16 మేకలు కనిపించలేదు. వాటిని వెతుక్కుంటూ ఉండగా ఓసి పరిసర ప్రాంతంలో అక్కడక్కడ మృతి చెందిన మేకలు పడి ఉన్నాయి. వాటిని సేకరించి రోడ్డుపై పెట్టి లారీలను నిలుపుదల చేసి ఆందోళనకు దిగారు. జిల్లా కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్ సింగరేణి అధికారులతో చర్చించారు. బేతంపూడి ఫీఏసీఎస్ సొసైటీ అధ్యక్షుడు లక్కినేని సురేందర్ రావు మేకల రైతుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్, బోడు ఎస్సై పీ.శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకొని బాధిత రైతులు అధికారులతో చర్చిస్తున్నారు.