calender_icon.png 22 October, 2024 | 8:30 PM

మహిళలుగా ముస్తాబై.. మగోళ్ల గర్భా డ్యాన్స్!

05-10-2024 12:00:00 AM

ప్రస్తుతం దేశంలో ఎక్కడా చూసిన నవరాత్రి సందడి నెలకొంది. మహిళలు దాండియా, కోలాటం ఆడుతూ నవరాత్రులకు మరింత శోభను తీసుకొస్తున్నారు. అయితే గుజరాత్‌లో జరిగే ఓ వేడుకలో మాత్రం మగవారు మహిళల మాదిరిగా దుస్తులు ధరించి ఉత్సవాలను జరుపుకుంటారు. అది కేవలం వేడుక మాత్రమే కాదు.. సంప్రదాయం కూడా. గుజరాత్‌లో అందరూ నవరాత్రుల్లో గర్భా ఎక్కువగా ఆడతారు.

అయితే సాధారణంగా మహిళలు, మగవారు కలిసి గర్బా ఆడతారు. కానీ మగవారు మాత్రమే మహిళల మాదిరిగా ముస్తాబై గర్భా ఆడటం ఇక్కడి విశేషం. ఆడవాళ్ళలా చీరతో సింగారించుకొని గర్భా ఆడుతూ ఆకట్టుకుంటారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌ని షాపూర్ ప్రాంతంలోని సాధు మాత గలి, అంబా మాత ఆలయంలో నవరాత్రి సమయంలో మగవారు గర్భా ఆడుతారు.

నవరాత్రులలో ఎనిమిదో రోజున ఆ ప్రాంతంలోని చీర కట్టుకుని గర్బా ఆడటానికి వస్తారు. అయితే మగోళ్ల ఉత్సవాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. సుమారు 200 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఈ సంప్రదాయం కొనసాగుతోందని అక్కడివాళ్లు చెబుతున్నారు.

ఈ సంప్రదాయం వెనుక ఓ చరిత్ర ఉంది. కథ బరౌత్ సమాజానికి చెందిన మగవారు సదుబా అనే స్త్రీచే శపించబడ్డారట. ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి మగవారు నవరాత్రులలో చీర ధరించి గర్బా ఆడుతున్నారు. దీనిని షెరీ గర్భా అంటారు.