14-02-2025 01:35:17 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి), విధి నిర్వహణను అంకితభావంతో పనిచే యాలని శిక్షణ ఆర్మీర్డ్ రిజర్వ్ డిఎస్పి యాకూబ్ రెడ్డి అన్నారు. పోలీస్ కానిస్టేబుల్ గా నియామకమై కొత్తగా వచ్చిన ఆర్ముడ్ రిజర్వు కానిస్టేబుల్ పోలీసులకు ఒక రోజు సీనియర్ అధికారులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేర కు జిల్లాలో నూతనంగా వచ్చిన ఆర్ముడ్ రిజర్వు పోలీసు కానిస్టేబుల్ కు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒక రోజు శిక్షణ నిర్వహిం చారు.
కొత్తగా పోలీస్ శాఖ కు వచ్చిన కానిస్టేబుల్లు వివిఐపి విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలతో ఎలా మెలగాలి, బందోబస్తు డ్యూటీ కి వెళ్ళినప్పుడు డ్యూటీ ఎలా చేయాలి, శాంతి భద్రత విఘాతం కలిగించే మరియు ప్రజలతో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలపై జిల్లాలోని అనుబవజ్ఞులైన పోలీస్ అధికారులతో అవగాహన శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అని అర్ముడ్ రిజర్వు డిఎస్పి యాకూబ్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్ముడ్ రిజర్వు డిఎస్పి యాకూబ్ రెడ్డి , ఆర్‌ఐలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ, సిఐలు చంద్రశేఖర్, తిరుపతయ్య, నరేష్, రామన్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.