26-03-2025 01:56:22 AM
జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య
హనుమకొండ, మార్చి25( విజయ క్రాంతి): లక్ష్యసాధనకు ఏకాగ్రత పట్టుదలతో కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ ను జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య సందర్శించారు.
ఈ సందర్భంగా కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమై స్టడీ సర్కిల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టడీ సర్కిల్ లోని విద్యార్థుల డార్మెట్రీ, లైబ్రరీ, డైనింగ్ హాల్, వంట గది కలెక్టర్ పరిశీలించారు. స్టడీ సర్కిల్ ఉద్యోగార్థులకు 75 రోజుల పాటు చేపట్టిన ఉచిత శిక్షణా తరగతులకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదటి సారి పోటీ పరీక్షలకు హజరవుతున్న విద్యార్ధులకు అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి కలెక్టర్ అవగాహన కల్పించారు.
పరిస్థితులు లక్ష్య సాధనకు అడ్డంకులు కావని, అవకాశాలను విజయాలుగా మలచుకోవాలని అన్నారు. ఉద్యోగార్థుల సందేహాలు, అనుసరించాల్సిన విధి విధానలపై విద్యార్ధులకు కలెక్టర్ నివృత్తి చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డిటిడిఓ ప్రేమకళా, ఏసీఎం సారయ్య దొర, ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ ప్రిన్సిపల్ లింగాల శ్రీరాములు, తదితరులు ఉన్నారు.