calender_icon.png 12 February, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి

12-02-2025 01:14:48 AM

  • స్థానిక సంస్థల ఎన్నికలపై రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ 
  • అధికారులకు శిక్షణ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల నియమవళికి అనుగుణంగా ప్రతి ఒక్కరు విధులు నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ఆడిటోరి యంలో స్టేజి వన్, స్టేజ్ 2 రిటర్నింగ్ అధికా రులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల విధుల పట్ల ఎంత అనుభవం ఉన్న శిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలు రిటర్నింగ్, హెయిర్ టర్నింగ్ అధికారులు పూర్తిస్థాయి లో అవగాహన కలిగి ఉండాల న్నారు.

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించా లన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారి క్రియాశీల పాత్ర పోషించవలసి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం అందించిన పుస్తకమును చదువు కొని ఎన్నికల కమిషన్ మార్గదర్శ కాలు అమలు చేయాలన్నారు. సర్పంచ్, వాడు సభ్యుల స్థానాల కోసం నామినేషన్ల సేకరణ రోజు నుండి నామినేషన్ల ఉపత్సాహరణ ప్రక్రియ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వాడు స్థానాలకు కోసం పోటీ చేసే అభ్యర్థులకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తీసుకోవాలని చెప్పారు. బ్యాంకు ఖాతాదా రని ఎన్నికల కార్యక్రమాలకు సంబంధించిన లావాదేవీలు జరుపుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేశారన్నారు.

బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముదిరించవ లసి ఉంటుందన్నారు. ఓటర్ జాబితాలోని పేరును అక్షర కణం కోసం పరికరంలోకి తీసుకుంటే ఇబ్బందులు తలెత్తమన్నారు.  జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, జెడ్పి సీఈవో జానకి రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, ఏపిడి బలరాజ్, ఆర్వోలు, సహాయ ఆరు రోజులు, ఎంపీడీవోలు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.