మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్, నవంబర్ 22 (విజయక్రాంతి): కొత్తగా కానిస్టేబుళ్లుగా ఎంపికైనవారు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాలని మెదక్ ఎస్పీ డీ ఉదయ్‌కుమార్ రెడ్డి సూచించారు. శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు వచ్చిన 149 మంది ఎస్సీటీపీసీ కానిస్టేబుళ్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పని ఒత్తిడి, ప్రతికూల పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుందని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫిట్‌నెస్ చాలా అవసరమన్నారు.
ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా, నిజాయతీతో విధులు నిర్వహిస్తే ప్రజలు ఆదరిస్తారని సూచించారు. సమాజంలో పోలీసులంటే గౌరవం పెరిగేలా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మహేందర్, సాయుధదళ డీఎస్పీ రంగనాయక్, ఏవో మణి, సూపరింటెండెంట్ వలియా నాయక్, ఆర్‌ఐ శైలేందర్, అల్తాఫ్, ఆర్‌ఎస్‌ఐలు నరేశ్, మహిపాల్ పాల్గొన్నారు.