calender_icon.png 22 September, 2024 | 7:04 PM

కథా రచన పట్ల అవగాహన ఉండాలి

28-07-2024 03:54:12 AM

డా.మాడభూషి రంగాచార్య స్మారక సంఘం కన్వీనర్ లలితాదేవి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): పిల్లల్లో సృజనాత్మక శక్తితో పాటు భాషాప్రయోగాభివృద్ధ్ది పెంపొందాలని ప్రముఖ బాలల కథా రచయితలు అన్నారు. డాక్టర్ మాడభూషి రంగాచార్య స్మారక సంఘం ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్ ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్‌లో బాలల కథా రచనపై శనివారం వర్క్‌షాప్ జరిగింది. కార్యక్రమాన్ని సంఘం కన్వీనర్ లలితాదేవి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల కు బడి వయస్సు నుంచే కథా రచన పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆధునిక కాలంలో విద్యార్థులు పరీక్షల కోసం చదువుతున్నారే కానీ.. భాష పట్ల మక్కువ, వాటి ప్రయోగంలో మెలకువలు, భాషాభివృద్ది వంటి అంశాలపై కనీసం అవగాహన ఉండటం లేదన్నారు.

కథా రచన పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల భాషలోని నైపుణ్యం, మెళకువలు, ఆ భాషలోని మాధుర్యాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. వర్క్‌షాప్‌లో 18 పాఠశాలల నుంచి 220 మంది విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం అతిథుల సూచనల మేరకు అప్పటిక ప్పుడు కథలు రాసి తమ సృజనాత్మకతను చాటుకున్నారు. విద్యార్థులు రచించిన కథలను బాలల కథా రచయితలు డాక్టర్ అమ రవాది నీరజ, డా.హారిక, శ్యామల సరిదిద్దారు.

వారి రచనలను విశ్లేషించి బహుమతులను ప్రకటించారు. ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ డైరెక్టర్ ప్రార్థన మణికొండ, బాలోత్సవ్ నిర్వాహకులు శాంతా రావు, డాక్టర్ వీఆర్ శర్మ, సంగీతం చాప్లీన్, చొక్కాపు వెంకటరమణ, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, పాఠశాల కరస్పాండెంట్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.