జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 2: దేశ వ్యాప్తంగా అమలులోకీ వచ్చిన నూతన చట్టాల అమలులో వనపర్తి జిల్లా పోలీసుశాఖ సమర్ధవంతంగా నూతన చట్టాలను అమలు పరచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. భారత ప్రభుత్వం తీసుక వచ్చిన నూతన నేరన్యాయ చట్టాలు-223 ద్వారా దర్యాప్తు వేగవంతంగా చేయడం తో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది.
కావున నూతన చట్టాల ప్రకారం కేసుల దర్యాప్తు మరియు విచారణలో పాటించవలసిన నూతన విధానాల మీద క్రింది స్థాయి సిబ్బంది నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరు సంపూర్ణ పరిజ్ఞానం మరియు అవగహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పోలీసు లీగల్ అడ్వైజర్ ఈపూరి రాములు ను జిల్లా ఎస్పీ శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు, బిసిఆర్బి డిఎస్పి, ఉమామహేశ్వరరావు, వనపర్తి సీఐ, కష్ణ, కొత్తకోట సిఐ, రాంబాబు ఆత్మకూరు సిఐ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, స్టేషన్ రైటర్ లు , రైటర్స్ లు, కోర్టు డ్యూటీ అధికారులు, రిసెప్షన్ సిబ్బంది మరియు పోలీస్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.