calender_icon.png 19 April, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ విధులపై పూర్తి అవగాహన ఉండాలి

11-04-2025 12:00:00 AM

  1. ఎన్నికల ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ నోడల్ ఆఫీసర్ డా.సునందరాణి

పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10(విజయక్రాంతి) : పోలింగ్ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ నోడల్ ఆఫీసర్ డా.సునందరాణి అన్నారు. హైదరాబాద్ లోక్‌ల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల, మైక్రో అబ్జర్వర్లు,ఓపీవోలకు తొలి విడత ఎన్నికల శిక్షణ కార్యక్రామాన్ని నిర్వహించారు.

ఎన్నికల నియమ నిబంధనలు, బ్యాలెట్ బాక్సుల సీల్ విధానం, బ్యాలెట్ పేపర్స్, అవసరమైన ఫారాలు పూరించడం తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు విజయలక్ష్మి, మమత, అవగాహన కల్పించారు. డెమో బ్యాలెట్ బాక్స్‌తో పోలింగ్ అధికారులతో ప్రత్యక్షంగా చేయించి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చారు.

పీవోలు, ఏపీవోలకు వచ్చిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా డా.సునందరాణి మాట్లాడుతూ  పోలింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.