12-02-2025 12:43:24 AM
జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ
ఖమ్మం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి):- ఇంటర్ నెట్ వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గివుండాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మజ అన్నారు. సోమవారం సురక్షిత ఇంటర్ నెట్ దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, సిబ్బందికి ఇంటర్ నెట్ వినియోగంపై చేపట్టిన వర్క్ షాప్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి పాల్గొన్నారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ, ఐసియా ప్రాజెక్ట్ ద్వారా, యన్‌ఐసి, సీడాక్ కేంద్ర సంస్థల సహకారంతో సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల్లో సురక్షిత ఇంటర్నెట్ వినియోగంపై వర్క్ షాప్ నిర్వహించారు.ఈ సందర్భంగా సురక్షిత ఇంటర్ నెట్ వినియోగంపై రూపొందించిన బ్రోచర్‌ను జిల్లా రెవెన్యూ అధికారిణి ఆవిష్కరించారు.