calender_icon.png 5 January, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ బాటలో నడవక తప్పదు

03-01-2025 12:32:01 AM

  1. మేడ్చల్, శామీర్‌పేట మెట్రో రైలు ప్రకటనతో రుజువైంది
  2. ఎమ్మెల్యే  వివేకానంద

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): కేసీఆర్ ప్రభుత్వం చూపిన మార్గంలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడవక తప్పదని బీ ఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో మార్గం పొడిగించనున్నట్టు సీఎం చేసిన ప్రకటనతో అది రుజువైందన్నారు.

మెట్రోతో పాటు జలవనరులు, విద్యుత్ అంశాల్లో కేసీఆర్ చూపిన మార్గంలో ముందుకు వెళ్లా ల్సిందేనన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే బాల్క సుమన్‌తో కలిసి మా ట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం మెట్రో మూడో దశ విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకుందని, కన్సల్టెంట్‌ను కూడా కేసీఆర్ ప్రభుత్వం నియ మించిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చీరాగానే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనే ఉద్దేశంతో మెట్రో విస్తరణ ప్రాజెక్టును రద్దు చేశారని మండిపడ్డారు. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు కూడా పూనుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం నుంచి సాయం వస్తేనే పనులు చేపడతామనడం సరికాదన్నారు.