calender_icon.png 6 March, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయిలో సైతం మాస్టర్స్ పోటీల్లో రాణించాలి

26-01-2025 12:32:16 AM

రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్‌మార్

శేరిలింగంపల్లి,జనవరి 25(విజయక్రాంతి): జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు కేరళలో నిర్వహించే జాతీయ మాస్టర్స్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా నుండి మాస్టర్స్ సత్తా చాటాలని రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్ తెలిపారు.జాతీయ మాస్టర్స్ పోటీల్లో పాల్గోనున్న రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ కి శనివారం చందానగర్ పిజెఆర్ స్టేడియంలో మాస్టర్స్ కు ట్రాక్ సూట్లను అందజేశారు.

ఈ సందర్భంగా కొండ విజయ్ మాట్లాడుతూ... రంగారెడ్డి జిల్లా నుండి 23 మాస్టర్స్ (12 మహిళలు,11 పురుషులు) పాల్గొననున్నట్లు తెలిపారు.ఈ నెల 5 వ తేదీన నిర్వహించిన రాష్ట్ర మాస్టర్స్ పోటీల్లో 100 మెడల్స్ సాధించి 2 వ స్థానంలో నిలిచినట్టు,జాతీయ స్థాయిలో సైతం రాణించడం ఖాయమని కొండా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్, ట్రెజరర్ స్వాతి, శివలీల రెడ్డి, నాగలక్ష్మి, శైలజ, శ్వేత, ఏసురత్నం,రామారావు తదితరులు పాల్గొన్నారు.