01-03-2025 12:00:00 AM
దౌల్తాబాద్, ఫిబ్రవరి 28: విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు డీలర్లు నిర్ణీత ధరలకు అమ్మాలని ఎక్కువ ధరలకే అమ్మితే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారిణీ రాధిక అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో పలు ఫర్టిలైజర్ దుకాణాలను దుబ్బాక ఏడిఏ మల్లయ్యతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రతి డీలర్ లైసెన్స్ కలిగి ఉండాలని ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు. ఎరు వులు పిఓఎస్ మిషన్ ద్వారానే ఎమ్మార్పీకే అమ్మాలన్నారు. డీలర్లు రిపోర్టులు, స్టాక్ రిజిస్టర్లు అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.