calender_icon.png 8 April, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొగమంచు ప్రమాదాలు లేకుండా చూడాలి

17-12-2024 01:57:58 AM

ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): పొగమంచు వల్ల రైల్వే ప్రమాదాలు జరగకుండా లోకో పైలెట్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ సూచించారు. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతున్నందున పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.

సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సోమవారం నిర్వహించిన భద్రతా సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. జోన్ వ్యాప్తంగా చేపడుతున్న సేఫ్టీ డ్రైవ్‌ల స్థితిగతులపై ఆయన సమీక్షించి, సూక్ష్మ లోపాలుంటే త్వరగా సరిదిద్దాలని సూచించారు. అనంతరం 13 మంది ఉద్యోగులకు ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్ పేరిట సేఫ్టీ అవార్డులను అందజేశారు.

రైల్వేలో సురక్షిత ప్రయాణం కోసం కష్టపడుతున్న సిబ్బందికి ఈ అవార్డులను అందిస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నామన్నారు. అవార్డు గ్రహీతల్లో లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, టెక్నీషియన్లు, వివిధ వర్గాలకు చెందినవారు ఉన్నారు. అనంతరం ఆగస్టు, సెప్టెంబర్ కాజీపేట సెక్షన్‌లో రుతుపవనాల కాలంలో దక్షిణ మధ్య రైల్వే అనుసరించిన విపత్తు ప్రతిస్పందన, పునరుద్ధరణ వ్యూహాలపై బుక్‌లెట్‌ను జీఎం విడుదల చేశారు.