11-03-2025 12:44:54 AM
కామారెడ్డి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి
కామారెడ్డి, మార్చి 10 (విజయక్రాంతి) ః కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవాలని కామారెడ్డి పట్టణ ప్రణాళిక శాఖ అధికారి గిరిధర్ కోరారు. సోమవారం పట్టణ ప్రణాళిక శాఖ కార్యాలయంలో విజయక్రాంతి ప్రతినిధితో ఆయన మాట్లాడారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 17,613 పాట్ల యజమానులు క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశం గతంలో వెయ్యి రూపాయలు చెల్లించిన వారు ప్రస్తుతం రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్లాట్ల యజమానులకు లేఅవుట్ చేసిన వారు 10 శాతం స్థలం లేకుండా ప్లాట్లను విక్రయించిన వారు కూడా రెగ్యుల రైస్ చేసుకోవచ్చని తెలిపారు.
25% శాతం రీబేట్ సౌకర్యాన్ని కల్పించిందని ఈ అవకాశాన్ని ప్లాట్ల రెగ్యులరైస్ చేసుకునే యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 71 లేఅవుట్ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెగ్యులరైజ్ చేసుకునే ప్లాట్ల యజమానులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.