calender_icon.png 18 April, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

10-04-2025 01:07:22 AM

డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య

నాగర్‌కర్నూల్ ఏప్రిల్ 9 (విజయక్రాంతి) దేశంలోని అన్ని చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వాటి ఆధారంగా తమ హక్కులను పొందాలని డిప్యూటీ చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య అన్నారు. బుధవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, సెక్రటరీ ఆదేశాల మేరకు తెలకపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో జువైనల్ జస్టిస్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాల్సా చైల్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పుట్టబోయే బిడ్డ నుండి చట్టంలో హక్కులు పొంది ఉన్నారని ప్రతి ఒక్కరు చట్టాలపట్ల అవగాహన కలిగి వాటి ద్వారానే తాము ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచనచారు. 6 నుంచి 14 సంవత్సరాల వయ స్సు గల బాల బాలికలందరు పనిలో కాకుం డా బడిలో చదువుకోవాలన్నారు.  వారితోపాటు పాఠశాల ఇన్చార్జి  ప్రధానోపా ధ్యాయుడు సంతోష్, వార్డెన్ రవి ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.