22-03-2025 05:31:07 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి, మండల లీగల్ సర్వీసెస్ ఆధారిటీ చైర్మన్ వి.శివ నాయక్ అన్నారు. శనివారం మండలం పరిధిలోని అంజనాపురం లోని ఎంపీపీఎస్ పాఠశాల లో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ చట్టాల గురించి గ్రామస్తులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుండే చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రతీ ఒక్కరు చట్టాలు తెలుసుకొని బాధ్యత కలిగిన పౌరులుగా ఉండాలని అన్నారు. ఉచిత న్యాయ సహాయం అందించడమే లీగల్ సర్వీసెస్ ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు.
అనంతరం జరిగిన మెడికల్ క్యాంపులో మోరంపల్లి బంజర్ ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొని, రోగులను పరీక్షించి మెజీస్ట్రేట్ శివ నాయక్ తో మందులు, విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్స్, పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియన్ న్యాయవాదులు ముత్యాల కిషోర్, పామరాజు తిరుమలరావు, భజన సతీష్, భాషం శారద, సంధ్య, సాధనపల్లి సతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తేజావత్ కిషన్ రావు, ఉపాధ్యాయ బృందం, బూర్గంపాడు సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ చైతన్య, మండల్ లీగల్ సర్వీసెస్ సిబ్బంది ఉబ్బల రమేష్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.