15-03-2025 07:09:08 PM
బైంసా (విజయక్రాంతి): డిజిటల్ ఆర్థిక లావాదేవీలు, సైబర్ క్రైమ్ లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు వాటిపై అవగాహన కలిగి ఉండాలని టీజీబీ రీజినల్ మేనేజర్ టీవీఎస్ రామారావు అన్నారు. మండలంలోని తిమ్మాపూర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు వానల్పాడు శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ లావాదేవీలు పాలసీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకు ద్వారా అందించే వివిధ రకాల సేవలను మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎటిఎం నగదు రహిత లావాదేవీలు తదితర అంశాలను సౌకర్యాల గురించి వివరించారు.
లావాదేవీల విషయమై బ్యాంక్ అధికారుల అంటూ వచ్చేఫోన్ కాల్స్ స్పందించకుండా సంబంధిత బ్యాంక్ అధికారులను సంప్రదించాలన్నారు. అలాగే క్యూఆర్ కోడ్ చెల్లింపులు చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించడంతో ప్రజలు మరిన్ని రుణాలు పొందవచ్చన్నారు. ఎస్ఎంబి విలాస్, బ్రాంచ్ మేనేజర్ అంజాచారి ఫీల్డ్ అధికారి నాయుడు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.