calender_icon.png 22 April, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 నాటికి పూర్తి చేయాలి

22-04-2025 12:30:00 AM

సూర్యాపేట, ఏప్రిల్21(విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇవ్వనున్న ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల విచారణ 30వ తేదీ కల్లా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నుండి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రెటరీలు, మున్సిపల్ అధికారులు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

  నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున సూర్యాపేట జిల్లాలో మొత్తం 14,000 ఇండ్ల మంజూరికి గాను, లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక జరగాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ద్వారా ఎంపిక కాబడిన లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించాలని, వీటి పర్యవేక్షణ కొరకు కోసం నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.

కోదాడ నియోజకవర్గానికి డిఎఫ్‌ఓ సతీష్ కుమార్ ,హుజూర్నగర్ నియోజకవర్గం డిటిడిఓ శంకర్, సూర్యాపేట నియోజకవర్గానికి ఈ డి ఎస్ సి కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్, తుంగతుర్తి నియోజకవర్గానికి డిపిఓ యాదగిరిని నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు . ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గాను ఒక కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులు అవుతారని,  గ్రామ పంచాయతీ సెక్రటరీలు మున్సిపాలిటీలలో వార్డ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత మే 3 తేదీ నుండి 5వ తేదీ వరకు ఎంపిక కాబడిన ఇందిరమ్మ లబ్ధిదారుల పేర్లను నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించబడాలని కలెక్టర్ తెలిపారు.

అనర్హులకు మంజూరి జరిగినట్లు నిరూపణ జరిగితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు. ఫేస్ వన్ లో 4322 ఇండ్లు, ఫేస్ టూ లో 9678 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.  అదనపు కలెక్టర్ పి రాంబాబు డి ఎఫ్ ఓ సతీష్ కుమార్ ఈ డి ఎస్ సి కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్ డిపిఓ యాదగిరి హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు