నవజాత శిశువు పట్ల జాగ్రత్తగా ఉండాలి
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గత మూడు రోజుల నుంచి రికార్డు స్థాయిలో వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో నవజాత పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని సప్న హాస్పిటల్ పిల్లల వైద్యురాలు డాక్టర్ నాలుగు స్వప్న శశికాంత్ తెలిపారు. ముఖ్యంగా నవజాత పశువులతో పాటు ఐదు సంవత్సరాలలోపు పిల్లవాళ్ళలు ఎండా వేడి సుఖకుండా తల్లిదండ్రులు చల్లని ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండేటట్లు చూసుకోవాలన్నారు.
శరీరం వేడికి గురు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉష్ణోగ్రత వేడి కాపుల వల్ల నవజాత శిశువుల శరీరం పలుచగా ఉండటంవల్ల జ్వరం ఇతర ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. చిన్నపిల్లలు హాస్పిటల్కు తీసుకు వచ్చేటప్పుడు ఉదయం సాయంత్రం వేళల్లోని ప్రయాణం చేయాలని సూచించారు. పిల్లలకు గంటకోసారి తడిగుడ్డులతో తుడువాలని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు తీవ్రతరంగా ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఏవైనా ఇబ్బంది ఉంటే వెంటనే పిల్లల వైద్యులను సంప్రదించాలన్నారు.






