రాజేంద్రనగర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ బాలాజీ
చేవెళ్ల, జనవరి 24: విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన ఏర్పరుచుకోవాలని రాజేంద్రనగర్ ట్రాఫిక్ డివిజన్ ఎసీపీ ఎ.బాలాజీ సూచించారు. శుక్రవారం చేవెళ్లలో వివేకానంద జూనియర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశంతో కలిసి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్లరే వాహపాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్, హెల్మెట్ లేకుండా సీట్ బెల్టు పెట్టుకోకుండా వాహనాలు నడుపొద్దని సూచించారు.
అతి వేగంతోపాటు మద్యం సేవించి వాహనాలు నడిపి కుటుంబాలను రోడ్డున పడేయోద్ద న్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఇంద్రా సేనా రెడ్డి, పోలీసు సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.