calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్వోఆర్ చట్టంపై అవగాహన ఉండాలి

17-04-2025 12:00:00 AM

నూతన చట్టంలోని అంశాలపై - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలలో సదస్సులు

మంచిర్యాల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి) : భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టంలోని అంశాలు, హక్కులపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్ డిఓ శ్రీనివాస్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్-2020లో పట్టాదార్ పాసు పుస్తకాలలో డిజిటల్ సంతకం సమస్య తలెత్తడంతో రైతులకు సమస్యలు తలెత్తాయని, భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో సాదాబైనమా, మ్యాప్, ఉచిత న్యాయ సలహాలతో పాటు రైతులకు ప్రయోజనం కలిగే విధంగా అనేక అంశాలను పొందుపర్చడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక మం డలాన్ని ఎంపిక చేసి మండలంలోని అన్ని రకాల సమస్యలను తెలుసుకొని నిర్ణీత గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని, సంబంధిత పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు.

ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలలో సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ఎంపిక చేసిన మండలంలో జూన్ 2వ తేదీ వరకు సమస్యల పరిష్కరించి, మిగిలిన మండలాలలోని సమస్యలను గుర్తించి ఆగస్టు 15వ తేదీలోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ సేవలలో భాగంగా పహా ణీలలో డిజిటల్ సంతకం, ఇతర అంశాలపై దృష్టి సారించి సమస్యలు పరిష్కరించే దిశ గా కృషి చేస్తామని తెలిపారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మండల పరిషత్ అభివృద్ధి అధికా రి, ఎస్.ఎల్.ఆర్. ఈ.డి. శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మి నారాయణ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అల్లం రవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.