calender_icon.png 10 January, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

05-01-2025 12:00:00 AM

  • ప్రజలకు చేరేలా వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి 

రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గద్వాల, జనవరి 4 (విజయక్రాంతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియంత్రిం చేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగా హన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్స వాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. శనివారం రాష్ర్ట బీసీ, రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభా కర్ హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహ ణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సంద ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లా డుతూ,  గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రొడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతుందని అన్నారు. ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ  ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  

నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి...

రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు మెస్ చార్జీలు పెంచామని, వారికి రుచికర మైన నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.  పిల్లలకు అందించే ఆహర నాణ్యతను కలెక్టర్లు, ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని, ఆహర సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లిస్తున్నా మని , నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ ఉండవద్దని అన్నారు.  సమావేశంలో జిల్లా కలెక్టర్ సంతోష్,  ఎస్పీ శ్రీనివాసరావు, రోడ్లు భవనాల శాఖ ఈఈ ప్రగతి, ఏపీ డి నర్సింలు,  రవాణా శాఖ, విద్యాశాఖ సహ య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి ః మంత్రి పొన్నం 

వనపర్తి, జనవరి 4 (విజయక్రాంతి) : ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే కాకుం డా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా భావిం చి అరికట్టేందుకు కృషిచేయాలని రాష్ర్ట రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సూచిం చారు. శనివారం మధ్యాహ్నం రోడ్డు భద్రత మాసోత్సవాల పై  హైదారాబాద్ నుండి  జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సర రోడ్డు భద్రతా వారోత్స వాలు నిర్వహించేదని, రోడ్డు భద్రతా పై అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా దీనిని రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు రాష్ర్టంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నిబంధనల పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.  అన్ని స్కూల్, కళాశాలల్లో ట్రాఫిక్ ట్రాక్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.