calender_icon.png 10 January, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు నియమాలపై అవగాహన కలిగి ఉండాలి

10-01-2025 06:21:17 PM

బైంసా (విజయక్రాంతి): విద్యార్థులు రోడ్డు నియమాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని బైంసా సీఐ గోపీనాథ్(CI Gopinath) అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు రోడ్డు భద్రత వారోత్సవాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు నడిపేవారు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. అలాగే సంబంధిత వాహన రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ పత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. రోడ్డు నియమాలను ఎవరు అతిక్రమించరాదన్నారు. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు, ఎస్సైలు కార్యక్రమంలో పాల్గొన్నారు.