calender_icon.png 12 February, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ విధుల పట్ల అవగాహన ఉండాలి

12-02-2025 12:47:20 AM

అదనపు కలెక్టర్ వేణుగోపాల్

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న జరుగనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్  ఎన్నికల సిబ్బందికి సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు మంగళవారం  ఎన్నికల నియమావళిని అనుసరించి, జిల్లా పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలకు మొత్తం 74 మందికి ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో   మొదటి విడత శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి  వెంకటేశ్వర చారి, ఎన్నికల సూపర్డెంట్ ధారా ప్రసాద్,డి ఎల్ ఎం టి పూసపాటి సాయి కృష్ణ, కిరణ్ కుమార్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.