వికారాబాద్, ఫిబ్రవరి -4: భూ సమస్యలతో పాటు ఇతర సమస్యల పై అవగాహనా కలిపించుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ బాద్యత గా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాలు నందు జిల్లా లో నూతనంగా విదులలో చేరిన 34 మంది జూనియర్ అసిస్టెంట్ లకు అవగాహనా కార్యక్రమము ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జూనియర్ అసిస్టెంట్లను ఉద్దేశించి మాట్లా డుతూ ప్రజా స్వామ్యం లో రెవెన్యూ లో పని చేయటమంటే చాల బాధ్యతతో పని చేయాల్సిన అవసరముందని, రెవెన్యూ ఒక్కటే కాదు, ఇతర శాఖ లపై అవగాహనా కలిగి ఉండాలని, తెలంగాణా చట్టాలపై పూర్తి అవగాహనా కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమమలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఎ ఓ ఫర్హీన , జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్
జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారo సందర్శించారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు.
ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. రిజిస్టర్ల ను పరిశీలించి సంతకాలు చేశారు. కలెక్టర్‌తోపాటు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లింగ్యా నాయక్, తహసిల్దార్ లక్ష్మినారాయణ , ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ హాలి, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.