జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): సైబర్ నేరాలు, సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవసరమైన అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల ఎస్పీ అశోక్’కుమార్ పేర్కొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన కోసం ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగృత దివస్ కార్యక్రమం ఎస్పీ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసుల ఆద్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిదిలో సైబర్ నేరాల నివారనే లక్ష్యంగా విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ క్రైంపై అవగాహన కల్పించారు.
సైబర్ జాగృత దివస్ కార్యక్రమం ద్వారా సైబర్ భద్రతతో పాటు ప్రస్తుతం ఓఎల్‌ఎక్స్ మోసాలు, ఏపీకే ఫైల్‌ని ఉపయోగించి నకిలీ కస్టమర్ కేర్ మోసాలు, బిట్ కాయిన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పిల్లలు ఎక్కువగా వాడే వాట్స్‌అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల గురించి అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యావంతులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాలని కోరారు.