calender_icon.png 26 March, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్‌లో ఆమోదం సాధించాలి

20-03-2025 02:14:21 AM

రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో వాటా కల్పించేందుకు బిల్లు ఆమోదం తెలిపినప్పటికీ పార్లమెంట్ లో 2/3 మెజార్టీతో ఆమోదం పొంది 9వ షెడ్యూల్లో పెట్టినప్పుడే రిజర్వేషన్లు అమలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహకారంతో బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీలతో కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలకు పరిమితం కాకుండా అమలకు నోచుకోవాలి. ప్రధానంగా విద్య వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ , వ్యవసాయ రంగం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. వేలకోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టుతున్నట్లు ప్రకటిస్తున్నారు కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదు.

 నీకోడె రవీందర్, సీనియర్ న్యాయవాది, అసిఫాబాద్