calender_icon.png 2 February, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుబాటులో ఉండాలి.. రోగులకు సేవలందించాలి

02-02-2025 05:04:28 PM

కలెక్టర్ రాహుల్ రాజ్..

రామయంపేట (విజయక్రాంతి): వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులకు సేవలందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. రామాయంపేట సి.హెచ్ .సీ ను కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని మందులు అందించే గది, రక్త పరీక్షల చేసే ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్ రూంను పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఆసుపత్రిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఔషధ నిల్వలు స్టాక్ పెట్టుకోవాలన్నారు. 

ఆసుపత్రిలో రోగులకు శుచికరమైన బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.