29-03-2025 11:13:21 PM
వనపర్తి (విజయక్రాంతి): రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు. రంజాన్ మాసం సందర్బంగా ప్రభుత్వం తరఫున వనపర్తిలోని స్టార్ ఫంక్షన్ హాల్ లోశనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ... అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జాలుద్దీన్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, జామా మసీదు ప్రధాన కార్యదర్శి అబ్జాలుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.