07-04-2025 09:32:37 PM
మైనారిటీ జిల్లా అద్యక్షుడు యాకూబ్ పాషా...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం పట్ల ముస్లీంలకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారీగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఎండి యాకూబ్ పాషా సోమవారం ఒక ప్రకటనలో ప్రభూత్వాన్ని కోరారు. ఈ యొక్క పథకం కింద ముస్లీంలకు రూ. 840 కోట్లు కేటాయించటం జరిగిందని, గత ప్రభుత్వంలో కూడా పలుమార్లు ధరఖాస్తు చేసినా అర్హులకు రుణాలు అందలేదనే ఉద్దేశ్యంతో ముస్లింలు రాజీవ్ యువ వికాసం పథకానికి ధరఖాస్తు చేసుకోవటానికి ఆసక్తి చూపటం లేదన్నారు. దరఖాస్తు చేసుకోవటానికి గడువు తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలలోని మైనారిటీ సంక్షేమ అధికారులు తక్షణమే ఆయా నియోజకవర్గాల్లోని ముస్లీం మత పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి యువతకు అవగాన కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని కోరారు. లేనియెడల ప్రభుత్వ లక్ష్యం నెరవేరక నీరుగారే ప్రమాదం ఉందని అన్నారు.