calender_icon.png 10 April, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్‌కతా, చెన్నైలలో మిన్నంటిన నిరసనలు..

05-04-2025 12:15:08 AM

వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసన తెలిపిన ముస్లింలు

ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన ఎంఐఎం, కాంగ్రెస్

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు నిరసిస్తూ కోల్‌కతా, చెన్నై నగరాల్లో ముస్లింలు నిరసన తెలిపారు. వారాంతపు ప్రార్థనల తర్వాత రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి.. ‘వక్ఫ్ బిల్లు మా కొద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఇక గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో కూడా నిరసనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి బిల్లుపై అభ్యంతరాలు తెలియజేశారు. పోలీసులు బెంగాల్ ఏఐఎంఐఎం చీఫ్, 40 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో కూడా అటువంటి పరిస్థితులే దర్శనం ఇచ్చాయి. విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్రి కజగం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. టీవీకే కార్యకర్తలు చెన్నతో పాటు ప్రధాన పట్టణాల్లో ‘వక్ఫ్ బిల్లును తిరస్కరించండి’, ‘ముస్లింల హక్కులు హరించకండి’ అనే నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వక్ఫ్ బిల్లు అప్రజాస్వామికం అని విజయ్ పేర్కొన్నారు. కేంద్రాన్ని సెక్యులరిజం గురించి ప్రశ్నించారు. లక్నోలో కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ‘మేము నిరంతరం సోషల్ మీడియాను గమనిస్తున్నాం.’ అని డిప్యూటీ కమిషనర్ (సెంట్రల్ లక్నో) ఆశిశ్ శ్రీవాస్తవ తెలిపారు.