calender_icon.png 19 April, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఇల్లందులో ముస్లింల నిరసన

18-04-2025 06:21:35 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణములో ఉన్న అన్ని మసీదుల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు అందరూ మానవహరముగా ఏర్పడి నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదుల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సూచనలతో  వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు పట్టణంలో మానవహారం నిర్వహించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీల జేఏసీ నాయకులు ముస్లిం కమిటీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు ఈరోజు నిర్వహించిన మానవహర కార్యక్రమంలో ఇల్లందు పట్టణ ముస్లిం మత పెద్దలు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం యువకులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.