calender_icon.png 2 April, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన

01-04-2025 12:41:48 AM

 కొండాపూర్ మార్చి 31 : వక్స్  ఏమైన్ మెంట్ బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా అన్యాయంగా పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు తీసుకువచ్చి జెపిసి కమిటీ పేరుతో డ్రామాలాడుతోందని ముస్లిం మత పెద్దలు ఆరోపించారు. సోమవారం రంజాన్ పండగ సందర్భంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ పిలుపు మేరకు  కొండాపూర్ మండలంలోని  అనంత సాగర్ లోని సెంటర్ లో ఈద్గాలో ప్రార్థనల అనంతరం నల్ల రిబ్బన్ లు  ధరించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు పేరుతో వక్ఫ్  ఆస్తులను కాజేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఇది హేయమైన చర్య అన్నారు.  కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ముస్లింలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజి జడ్ పి కో ఆప్షన్ సభ్యుడు అమీనొద్దీన్, ముస్లిం పెద్దలు వహీద్, జలీల్, జాకీర్,  అజీమ్ పాష, మోహీన్,  మహా మూద్, చాంద్ పాషా,  ఆయాజ్ లున్నారు.