calender_icon.png 3 April, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసన తెలిపిన ముస్లింలు..

01-04-2025 12:00:00 AM

కూసుమంచి , మార్చి 31 :భారతదేశ ముస్లింల సంపద అయిన వక్ప్ స్థిరాస్తులపై కన్నేసిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే వక్ప్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం కూసుమంచి మండల కేంద్రంలో ముస్లింల నిరసన తెలిపారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించాలనే ప్రతిపాదన రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తుందని, ఇది మత స్వేచ్ఛకు విరు ద్ధమని వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో ముస్లింలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆసిఫ్ పాషా మాట్లాడుతూ.. కేంద్రం వక్ఫ్ బిల్లు సవరణ పేరుతో వక్ఫ్ ఆస్తులపై కన్నేయ్యడాన్ని నిరసిస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసన కార్యక్ర మాలకు చేపట్టడం జరిగిందని అందులో భాగంగా నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ముస్లింల పట్ల వివక్ష చూపిస్తుందని, సబ్ కా సాత్ -సబ్ కా వికాస్ అనేది కేవలం నినాదం లాగానే ఉందని ముస్లింల పట్ల వివక్ష చూపిస్తుందని అన్నారు. ముస్లింల పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం, వారిని అణగదొక్కడం కేంద్ర ప్రభుత్వానికి తగదని అన్నారు. ఈద్ ప్రార్ధన అనంతరం ముస్లిం సోదరులు పాలేరు నుంచి కూసుమంచి వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు.