25-04-2025 11:00:06 PM
మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో ముస్లింలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ ప్లే కార్డ్స్ ప్రదర్శించారు. అంతకుముందు మసీదులలో నల్ల బ్యాడ్జీలు ధరించి నమాజు చేసిన అనంతరం పాకిస్తాన్ ముర్దాబాద్ హిందుస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.