calender_icon.png 26 April, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహాల్గంలో ఉగ్రదాడిని నిరశించిన ఇల్లందు ముస్లింలు

25-04-2025 09:06:25 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఈనెల 22న జమ్మూ కాశ్మీర్ పహాల్గంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమరవీరులకు సంతాపాన్ని తెలియజేస్తూ ఇల్లందులో శుక్రవారం ముస్లింలు నిరసన తెలిపారు. ముందుగా మృతిచెందిన వారికీ మౌనం పాటించి  దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే కఠినంగా శిక్షించాలని, టెర్రరిజం డౌన్ డౌన్ అంటూ హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.

ఇల్లందు పట్టణంలోని అన్ని మసీదుల నుంచి ముస్లిం సోదరులందరూ కలిసి ఆమ్ బజార్లో ఉన్న జామే మసీద్ నుంచి జగదాంబ సెంటర్, పాత బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించి ఉగ్రవాద దాడిలో అమరులైన కుటుంబాలకు ఇల్లందు పట్టణ ముస్లిం సోదరులు, ఇల్లందు పట్టణ కాంగ్రెస్, బి ఆర్ ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీల రాజకీయ ముస్లిం నాయకులు, ఇల్లందు పట్టణ హిందూ, క్రైస్తవ మత పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడి చేసిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

దేశంలో హిందూ ముస్లిం అంటూ తేడా  లేకుండా ఎన్నో దశాబ్దాల నుంచి కలిసిమెలిసి ఉంటున్న క్రమంలో ఈ దాడి చేయడము సరికాదని, ఖబర్దార్ టెర్రరిస్ట్ అంటూ నినాదాలు చేసి ఎన్నటికీ  హిందూ ముస్లింల ఐక్యతను వేరు చేయడము ఎవరి తరం కాదని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ, క్రైస్తవ మత పెద్దలు ఇల్లందు పట్టణ కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీల రాజకీయ ముస్లిం నాయకులు పాల్గొన్నారు.