calender_icon.png 15 January, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్సాంకు ముస్లింలే సమస్య..

18-07-2024 12:05:00 AM

గువహటి, జూలై 17: అస్సాం రాష్ట్రంలో ముస్లింల జనాభా 40 శాతానికి చేరుకుందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. 1951లో 12 శాతం ఉన్న ఈ కమ్యూనిటీ ప్రస్తుతం 40 శాతానికి చేరిందని వెల్లడించారు. ఈ జనాభా పెరుగుదలే తనకు అతిపె ద్ద సమస్య అని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారా యి. జూలై 1న కూడా శర్మ ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ ఉద్దేశించకుండా ఒక కమ్యూనిటీ వల్లే అస్సాంలో నేరాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్య లు కూడా ముస్లిం వర్గాన్నే ఉద్దేశించి అన్నారని అంతా ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశీ మైనార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఓటు వేశారని, బీజేపీ చేసిన అభివృద్ధిని వారు ఏ మాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా ఓట్లు వేశారని విమర్శించారు.