18-03-2025 06:34:48 PM
మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకుబ్ పాషా..
పాల్వంచ (విజయక్రాంతి): రాజీవ్ యువవికాసం పథకం కింద సబ్సిడీపై రుణాలు పొందేందుకు ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన నిరుద్యోగులు ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్ పుస్తకంతో tgobmms.cgg.gov.in అనే వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని అన్నారు. ఎంచుకున్న యూనిట్ ను బట్టి 50 వేల నుండి 3 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల నిరుగ్యోగ ముస్లిం యువకులు ఏప్రిల్ 5వ తేదీలోపు ఆన్లైన్ చేసుకోవాలి అని సూచించారు. ఇతర వివరాలకు 8520860785 అనే నంబర్లకు సంప్రదించాలని కోరారు.