calender_icon.png 20 April, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ

19-04-2025 12:45:14 AM

సంఘీభావం తెలిపిన డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి 

గజ్వేల్, ఏప్రిల్ 18 : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు కు వ్యతిరేకంగా సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో శుక్రవారం తంజీముల్ మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ము స్లింల ర్యాలీకి డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మతిన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ముస్లింలకు కేటాయించిన భూములను కేంద్ర ప్రభుత్వం లాగేసుకోవాలని చూస్తుందని ఆరోపించారు. దేశంలోని భూములను సంస్థలను ఇద్దరు అమ్ముతున్నారని, మరో ఇద్దరు కొంటున్నారని ఆరోపించారు. వెంట నే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని అప్పటివరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు.