calender_icon.png 5 February, 2025 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరాముడిపై ముస్లిం కవి గజల్

05-02-2025 12:58:28 AM

ప్రధాని మోదీ ప్రశంసలు

భోపాల్, ఫిబ్రవరి 4: అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ స ందర్భంగా ప్రసిద్ధ ముస్లిం కవి అం జుమ్ బరాబంక్వి శ్రీరాముడిని స్తుతి స్తూ గజల్ రాశారు. ఆ గజల్ మోదీని మెప్పించింది. మోదీ కవి అ ంజుమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ప్రత్యేకంగా లేఖ పంపించారు.

అంజుమ్ లాంటి కవులు దేశ ఔన్నత్యాన్ని మహోన్నత శిఖరాలకు తీసు కెళ్తారని కొనియాడారు. కవి అంజు మ్ స్పందిస్తూ.. తమ ప్రాంతంపై శ్రీరాముడి ప్రభావం ఎక్కువగా ఉం టుందన్నారు. శ్రీరాముడు తన జీవితంపైనా ప్రభావం చూపించాడని, ఒక కుమారుడిగా, సోదరుడిగా, భ ర్తగా, రాజుగా శ్రీరాముడు పోషించిన పాత్ర అమోఘమని అభిప్రా యపడ్డారు.

ప్రతి పురుషుడు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని, శ్రీరాముడి లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అంజు మ్ ప్రస్తుతం భోపాల్‌లో స్థిరపడ్డారు. ఒక్క మోదీనే కాక దేశవ్యా ప్తంగా అంజుమ్‌కు అభినందనలు వె ల్లువెత్తుతున్నాయి.