calender_icon.png 18 April, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ చట్టం బిల్లుపై ముస్లింల వ్యతిరేకత...

09-04-2025 10:41:32 PM

వక్ఫ్ బచావో ర్యాలీని జయప్రదం చేయండి..

ఎండి ఖాన్..

కొత్తగూడెం (విజయక్రాంతి): వక్ఫ్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు దశల వారిగా నిరసన చేపడతామని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాలేద్ సైఫుల్లా అన్నారు. కొత్తగూడెం మైనారిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వక్స్ చట్టానికి వ్యతిరేకంగా అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో, సవరణలను పూర్తిగా రద్దు చేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

దేశంలోని ముస్లిం సమాజం ఎలాంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై తమతో కలిసి పోరాటం చేసేవారిని ఆహ్వానిస్తామని, ఈ నెల 13న హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టనున్న, వక్ఫ్ బచావో ర్యాలీ ప్రదర్శనను జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు సిరాజుద్దీన్, జిల్లా ఉపాధ్యక్షులు కరీం పాషా, సెక్రటరీ గౌస్ పాషా, టౌన్ అధ్యక్షులు జానీ పాషా, వైస్ ప్రెసిడెంట్ అక్బర్ బాయ్, జనరల్ సెక్రటరీ ఖామర్ బాయ్, చుంచుపల్లి మైనారిటీ అధ్యక్షులు గోరేబాబు తదితరులు పాల్గొన్నారు.