calender_icon.png 20 April, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖర్బూజా మంచిదే కానీ!

23-03-2025 12:00:00 AM

వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాల్లో ఖర్బూజా ఒకటి. దీన్ని చాలామంది ఇష్టంగా తింటారు. దీన్ని తినడం వల్ల దాహం తీరుతుంది. ముఖ్యంగా ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవి తాపాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖర్బూజా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అవేంటో చూద్దాం.. 

డయాబెటిస్ ఉన్నవారు సాధారణంగా ఖర్బూజా ఎక్కువగా తినకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పండు గ్లుసైమిక్ ఇండెక్స్ 60 మధ్య ఉంటుంది. అందువల్ల ఈ పండు అధికంగా తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి. 

అలెర్జీలు లేదా చర్మ సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొంతమందికి ఈ పండు తిన్న వెంటనే దద్దుర్లు, దురద, వాపు వస్తుంది.

పేగు సమస్యలు, గ్యాస్, ఉబ్బరం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబిఎస్) ఉన్నవా రు కార్బోహైడ్రేట్లు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియపై ప్ర భావం చూపే అవకాశం ఉంది. అధికంగా తీసుకుంటే అదది పేగులలో వాయువును పెంచి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. 

సాధారణంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయ తినకూడదు. ఇందులో ని అధిక పొటాషియం కంటెంట్ మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో పొటాషియంలో పేరుకుపోయి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

ఖర్బూజలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది అధికంగా తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయిలు తగ్గవచ్చు. తద్వారా హైపోనాట్రేమియా అనే సమస్య పెరగవచ్చు. దీనివల్ల శరీరంలో వాపు, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. 

ఉదయం లేదా మధ్యాహ్నం ఖర్జూజా తిన డం మంచిది. కాని ఖాళీ కడుపుతో తినడం సరికాదు. ఇది గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అలాగే రాత్రిపూట కూ డా తినకూడదు. మధుమేహం, మూత్రపిండాల సమస్య, అలెర్జీలు, గ్యాస్ట్రిక్ సమస్యల తో బాధపడేవారు ఈ పండును మితంగా లేదా వైద్యుడి సలహా మేరకు తినాలి.